Home అంతర్జాతీయ వార్తలు మరోసారి వణికించిన డ్రాగన్

మరోసారి వణికించిన డ్రాగన్

7 శాతం పడిపోయిన చైనా స్టాక్‌మార్కెట్ విలువ,

చమురు ధరల పతనంతో పలు దేశాలపై ప్రభావం
మన మార్కెట్ 500 పాయింట్లకు పైగా డౌన్ వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్, ఒకటిన్నరేళ్ల కనిష్ఠానికి సూచీలు

dragonన్యూఢిల్లీ: చైనా ధాటికి మరోసారి దేశీయ మార్కెట్‌లు వి లవిల్లాడిపోయాయి. చైనాలో ఈక్విటీ, కరెన్సీ మార్కెట్ లు భారీగా పడిపోవడం తీవ్ర ప్రభావం చూపగా, సెన్సెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. దాదాపు ఒకటిన్నరేళ్ల కనిష్టానికి దేశీయ సూచీలు దిగజారాయి. ఈ వారంలో రెండోసారి చైనా షేర్లు ఏడు శాతానికి పడిపోవడంతో స్టాక్‌మార్కెట్లను వెంటనే నిలిపివేశారు. మార్కెట్ ప్రారంభమైన అరగంటలోనే చైనా షేర్లు టప టపా పడిపోవడంతో అంతా విస్తుపోయారు. దీంతో మా ర్కెట్‌ను రద్దు చేశారు. మరోవైపు ముడి చమురు ధరలు కొన్నేళ్ల కనిష్ఠానికి తగ్గడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీసిం ది. బిఎస్‌ఇ సూచీ సెన్సెక్స్ 554.50 పాయింట్లు పడిపోయి 24,851.83 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 172.70 పాయింట్లు పతనమై 7,568.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ రంగాల వారీగా సూచీలను పరిశీలిస్తే రియాల్టీ రంగం 4.5 శాతం డౌన్ అయింది. ఆ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 3.91 శాతం, ఆటో 3.72 శాతం, మెటల్ 3.72 శాతం పతనమయ్యాయి. ప్రధానంగా బిహెచ్‌ఇఎల్ 6.98 శాతం, టాటా స్టీల్ 6.85 శాతం, టాటా మోటార్స్ 6.15 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.98 శాతం, మారుతీ 4.75 శాతం నష్టపోయా యి. అమెరికన్ డాలర్‌తో యువాన్ మారకం విలువను చైనా సెంట్రల్ బ్యాంక్ తగ్గించడం, అదేసమయంలో చైనా మార్కెట్ల క్షీణత, ముడి చమురు ధరలు భారీగా 11 ఏళ్ల నాటి కనిష్ఠ స్థాయికి (బ్యారెల్ 34డాలర్లు) పడిపోవడం వంటి పరిణామాలు మార్కెట్‌పై దెబ్బమీద దెబ్బ తీశాయి. చైనా స్టాక్‌మార్కెట్‌లో పరిణామాలతో భారత్, జపాన్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుదేల య్యాయి. సిఎస్‌ఐ-300 సూచీ 7 శాతం కన్నా ఎక్కువ గా క్షీణించడంతో చైనాలో గురువారం ట్రేడింగ్ నిలిపే శారు. నిఫ్టీలో వేదాంత సంస్థ షేరు భారీగా నష్టపోయిం ది. మరోవైపు చైనా వణుకు ఎఫెక్ట్ రూపాయిపైనా కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా ప్రభావం చూపగా రూపాయి విలువ గతంలో ఉన్న రూ.66.82 నుంచి రూ. 66.88కు తగ్గింది. చైనా స్టాక్ మార్కెట్‌కు కొన్ని నియమాలను రూ పొందించారు. సిఎస్‌ఐ-300 సూచీలో ఎప్పుడైనా 5 శాతం లాభం లేదా నష్టం నమోదైతే వెంటనే 15 నిమిషా ల సేపు ట్రేడింగ్‌ను నిలిపేస్తారు. అదే 7 శాతం పైన మార్కెట్ నష్టపోతే ఆ రోజంతా ట్రేడింగ్‌ను రద్దు చేస్తారు. గురువారం షాంఘై కాంపోజిట్ 7.32 శాతం క్షీణించ గా.. షెన్‌జెన్ కాంపొజిట్ 8.34 శాతం నష్టపోయింది. దీంతో సీఎస్‌ఐ-300 సూచీ 7.21శాతం నష్టాలు సూచించడంతో మిగతా ట్రేడింగ్‌ను రద్దు చేశారు. జపాన్ నిక్కీ 1.5 శాతం డౌన్ కాగా దక్షిణ కొరియా కోప్సి 0.7 శాతం పడిపోయింది. అమెరికాలో స్టాక్స్ అక్టోబర్‌లో స్థాయి దిగువకు పడిపోయాయి. తాజాగా చైనా మందగమనం, అంతర్జాతీయంగా చమురు ధరల పతనం వీటిపై భారంగా ఎక్కువగా పడింది.