Home జాతీయ వార్తలు డిఆర్ఐ దాడులు.. 6వ అంతస్తు నుంచి నోట్ల కట్టలు విసిరేశారు(వీడియో)

డిఆర్ఐ దాడులు.. 6వ అంతస్తు నుంచి నోట్ల కట్టలు విసిరేశారు(వీడియో)

 

ఓ కమర్షియల్ భవనంలోని 6వ అంతస్తు కిటికి నుంచి డబ్బులు విసురుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. కోల్ కత్తా లోని బెంటిక్ వీధిలో ఉన్న ఓ కమర్షియల్ భవనంలోని ప్రైవేటు కంపెనీ ఆఫీసులో డిఆర్ఐ అధికారులు బుధవారం మధ్యహ్నం తనిఖీలు నిర్వహించారు. అయితే, అదే భవనంలోని 6వ అంతస్తులో ఉన్న ఓ ఆఫీస్ కిటికి నుంచి రూ. 2000, రూ.500, రూ.100 నోట్ల కట్టలు విసిరేశారు. దీన్ని గమనించిన ఓ షాప్ లో పనిచేసే వ్యక్తి తన ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. కాగా, అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సమ‌యంలో చీపుర‌క‌ర్ర‌ల‌తో కిటికీలోంచి నోట్ల క‌ట్ట‌ల‌ను విసిరేసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

DRI Raids: Money thrown out of 6th floor office in Kolkata