Home కరీంనగర్ రోడ్డు ప్రమాదం లో డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదం లో డ్రైవర్ మృతి

driver

మన తెలంగాణ/తిమ్మాపూర్ ః అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన మండలంలోని నుస్తులాపూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎల్‌ఎండి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి( 54) అనే వ్యక్తి రోజు మాదిరిగానే టాటా ఎస్ వాహనంలో కరీంనగర్ వైపు నుండి పేపర్ ను తీసుకువెళ్తుండగా నుస్తులాపూర్ లోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న కల్వర్ట్ ను ఆదుపు తప్పి డీ కొట్టడంతో డ్రైవర్ తిరుపతి రెడ్డి కి తీవ్ర గాయాలు అయ్యాయి. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న సిబ్బంది గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్ లో అస్పత్రి కి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. అనంతరం పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అజాగ్రత్త, అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. దీంతొ ఎల్‌ఎండి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు.