Home ఖమ్మం అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

అనుమానాస్పద స్థితిలో డ్రైవర్ మృతి

Driver killed in suspicious position

సత్తుపల్లిరూరల్: మండల పరిధిలోని కిష్టారం సమీపంలో గల హోలి ఫెయిత్ బి.ఇడి కళాశాల వద్ద ఆగి వున్న డిసీఎంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… జనగామ నుండి సత్తుపల్లి వైపు వస్తున్న డీసిఎం హోలి ఫెయిత్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉండగా అందులో డ్రైవర్ వాంతులు చేసుకొని మృతి చెంది ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతి పై, మృతుడి వివరాల పై ఆరా తీస్తున్నారు.