Thursday, April 25, 2024

మంత్రి కూతురితో ప్రేమవ్యవహారం.. భయంతో డ్రైవర్ సెల్ఫీ వీడియో

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఓ మంత్రి కూతురితో డ్రైవర్ ప్రేమ వ్యవహారం నడిపిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రి శేఖర్ బాబు కూతురును డ్రైవర్ సతీష్ కుమార్ ప్రేమించాడు. కొన్నాళ్లపాటు సాగిన వీరి ప్రేమ వ్యవహారం చివరకు మంత్రికి తెలిసింది. దీంతో మంత్రి ఆగ్రహంతో డ్రైవర్ సతీష్ ను కొట్టించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ సతీష్.. ”మంత్రి కూతురు నేను ఆరేళ్లు ప్రేమించకున్నాం. మంత్రి శేఖర్ బాబు మా పెళ్లికి ఒప్పుకోవడంలేదు. మా కుంటుంబ సభ్యులను పోలీసులతో కొట్టించారు. ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. మంత్రి నుంచి నాకు ప్రాణహానీ ఉంది” అని  సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Driver love affair with Minister’s daughter in TN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News