Home తాజా వార్తలు బ్రెయిన్ బ్లీడింగ్‌ను తగ్గించే డ్రగ్

బ్రెయిన్ బ్లీడింగ్‌ను తగ్గించే డ్రగ్

brain-bleeds

లండన్ : బ్రెయిన్ బ్లీడింగ్, స్ట్రోక్ రిస్కును తగ్గించే డ్రగ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరియాకు సం బంధించిన లోపాలు ఉన్న వారికి, బ్రెయిన్ బ్లీడింగ్ ఉన్న వారికి స్ట్రోక్స్ రిస్కు ఉన్న వారికి ఈ మందును ఉపయోగించి చికిత్స చేయడానికి అనుమతించారు. కొల్లజెన్ 4 అనే జన్యువులో లోపాలుంటే బ్రెయిన్ బ్లీడింగ్ తోపాటు స్ట్రోక్ రిస్కు కూడా పెరుగుతుంది. ఈ జన్యువుల్లో మార్పులు రావడంతో కంటికి, మూత్రపిండాలకు, రక్తనాళాలకు కూడా నష్టం కలుగుతుంది.

ఫలితంగా మెదడు లోని రక్త నాళాలు దెబ్బతింటాయి. చివరకు బాల్యంలో కూడా బ్రెయిన్ బ్లీ డింగ్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. బ్రిటన్ లోని మాంచెస్టర్, ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలో కూడా ఇటువంటి పరిస్థితిని గమనించారు. కొల్లజెన్ 4 జన్యువు లోని లోపాల వల్ల అలాంటి వ్యాధి సంక్రమించడాన్ని గుర్తించారు. సోడియం ఫినైల్ యాసిడ్‌ను ఉపయోగించి బ్రెయిన్ బ్లీడింగ్‌ను తగ్గించ గలిగారు. అయితే ఇదే జన్యులోపాలతో కంటికి, మూత్రపిండాలకు వ్యాధులు దాపురిస్తే ఈ చికిత్స పనిచేయడం లేదు. జన్యు మార్పు లు ఎలా వివిధ కండరాల్లో జరుగుతున్నాయో తెలుసుకోడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. అప్పుడు కంటికి, మూత్రపిండాలకు కూడా చికిత్స చేయడానికి కావలసిన వైద్య విధానాలు రూపొందించడానికి వీలవుతుంది.బ్రెయిన్ బ్లీడింగ్‌కు హెమరోహేజిక్ స్ట్రోక్ వంటి సాధారణ వ్యాధులను నయం చేసే కచ్చితమైన చికిత్స ప్రస్తుతం లేదు. పరిశోధకులు కనుగొన్న డ్రగ్ వల్ల కొత్త చికిత్స విధానాలు ఆవిపరిష్కారమవుతాయి.

-సైన్స్ విభాగం

Drug to Reduce Brain Bleeding

telangana latest news