Home తాజా వార్తలు డ్రగ్స్ ముఠా అరెస్టు

డ్రగ్స్ ముఠా అరెస్టు

MAHESH

హైదరాబాద్ : తమ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైజీరియన్‌కు చెందిన గ్యాబ్రియల్ సహా ముగ్గురిని అరెస్టు చేశామని ఆయన చెప్పారు. అరెస్టు అయిన వీరి నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. నిందితులు డ్రగ్స్‌ను రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నట్టు తమ విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. చాక్లెట్స్, బిస్కెట్స్ రూపంలో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ సరఫరా చేసే వారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Drugs gang arrested