Thursday, April 25, 2024

మూడు కోట్ల విలువైన మత్తు పదార్థాల పట్టివేత

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో బుధవారం సాయంత్రం పోలీసులు మూడు కోట్ల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వట్టెంలోని వ్యవసాయ పొలం వద్ద ఉన్న పౌల్ట్రీ ఫారం లో ఆల్ఫ్రాజోలమ్ ఇతర మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల నిషేధ చట్టం ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

31.42 కిలోల ఆల్పోజలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో 3.14 కోట్లు ఉంటుంది. ఇదిలా ఉండగా తిమ్మాజీపేట మండలం బావాజీ పల్లికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో కూడా మత్తు పదార్థాలను కలిగి ఉండి పలు కేసులలో ఇతను నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. పోలీసులతోపాటు మత్తు పదార్థాల నియంత్రణ నిషేధిత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పూర్తిస్థాయి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News