Home తాజా వార్తలు ఆ మందుబాబుపై పోలీసుల మమకారం

ఆ మందుబాబుపై పోలీసుల మమకారం

Drunk-and-Drive

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఐదు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను బేఖాతరు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బెంజ్ కారు నడుపుతూ చిక్కిన కోటీశ్వరుడిపై మమకారం చూపించారు. మద్యం తాగి తూలుతున్న మందుబాబుకే కారు స్టీరింగ్ అప్పగించారు. మందుబాబు కారు నడపగా పక్క సీట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూర్చొన్నారు. మద్యం తాగిన మత్తులో కారు నడుపుతూ ప్రమాదం జరిగితే ఎవరిదీ బాధ్యత అని జనం ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు బెంజ్ కారు నడపడం రానప్పుడు క్రేన్ సహాయంతో తీసుకెళ్లొచ్చని, సంపన్నులైన మందుబాబులకో రూలా?… సామాన్యులకు మరో రూలా? ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.