Saturday, March 2, 2024

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 85 మందిపై కేసులు

- Advertisement -
- Advertisement -

drink-and-drive

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 85మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 34 కార్లు, 47బైకులు, 4 ఆటోలను సీజ్ చేశారు. అయితే తనిఖీలు జరుపుతున్న ట్రాఫిక్ పోలీసులతో ఓ యువతి గొడవకు దిగింది. యువతి మోతాదుకు మించి మద్యం సేవించినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు తన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో వాగ్వాదానికి దిగింది. కాగా, మరో మందుబాబు పోలీసులకు మక్కాకోట్టి కారులో ఉడాయించాడు. బండి నంబర్ ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమచారం. పట్టుబడిన మందుబాబులకు సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నామని పోలీసులు తెలిపారు.

Drunk and Drive Test in Jubilee Hills and Banjara Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News