Home హైదరాబాద్ ఔటర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్

ఔటర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్

Drunk-and-drive

* మొదటి రోజే 137 కేసులు
* 31300 పాయింట్లుగా ఆల్కహాల్ నమోదు
* నగరంలో 5 రోజుల్లో 630 కేసులు
* 125 మందికి జైలు… 33 మంది లైసెన్సులు రద్దు

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఇప్పటి వరకు జంటనగరాల్లో వారాంతపు రోజు లు రాత్రి వేళల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ వచ్చిన పోలీసులు ఇ ప్పుడు ఔటర్‌రింగ్ రోడ్‌పైనా ప్రత్యేక దృష్టిసారించారు. గత శుక్రవారంతో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. మొత్తం 137 మందిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఓఆర్‌ఆర్‌లో ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ తనిఖీలు చేపడుతున్నట్టు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. టోల్ గేట్ల వద్ద ప్రవేశం, బయటకు వెళ్ళే మార్గాల్లో నిర్వహించిన తనిఖీల్లో పోలీసుల ఆశ్చర్యపోయే ఆల్కాహాల్ పాయింట్లు నమోదయ్యాయి. వాహనాలను నడుపుతున్న వారిలో 31300 వరకు ఆల్కాహాల్ పాయింట్లు నమోదు కావడంతో పోలీసు అధికారులు ముక్కున వేలేసుకునేంత పనైంది. ఆల్కహాల్ 51100 పాయింట్ల మధ్య నమోదైన వారు 48 మందిగా గుర్తించారు. ఇందులో కార్లు 90, భారీ వాహనాలు 41 కగా ఇతర వాహనాలు 6 గా ఉన్నాయి. మొత్తం 31 టోల్‌గేట్ల వద్ద సుమారు 300 మంది పోలీసు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్టు తెలిపారు.

నగర కమిషనరేట్‌లో…
నగరంలోని ప్రధాన రహదారుల్లో ఈ నెల 5 నుండి 9 వరకు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 630 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వారిక ఎర్రమంజిల్ కోర్టు శిక్షలు విధించింది. 125 మంది వాహనదారులకు 2 రోజుల నుండి 15 రోజుల వరకు జైలు శిక్షను విధించింది న్యాయస్థానం.
33 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దుపరిచింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 630 మందికి రూ. 11.80 లక్షల జరిమానాలుగా విధించారు. విధించిన చాలానాలను ఎగవేసిన 42 మందికి జైలు శిక్ష విధించారు. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.