Saturday, April 20, 2024

పామును స్టఫ్‌లా నమిలి చంపిన మందుబాబు

- Advertisement -
- Advertisement -

Drunk man

 

కోలార్ : దారికి అడ్డు వచ్చిన పాము ఓ మందుబాబు ఆగ్రహంతో పట్టుకొని దాన్ని స్టఫ్‌లా నమిలేశాడు. నోటితో కరకరా నమిలి ఊషేశాడు. కర్నాటకలోని కోలార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ’‘నా దారికే అడ్డు తగులుతావా’ అంటూ మత్తులో ఉన్న ఆ యువకుడు గట్టిగా అరుస్తూ, మెడలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా దానిని ఎడాపెడా ముక్కముక్కలుగా కొరికి చంపేశాడు. కుమార్ అనే ఆ యువకుడు లాక్‌డౌన్ సడలింపులో భాగంగా వైన్‌షాపులు తెరవడంతో మద్యం కొనుక్కుని బండి మీద వస్తుండగా ఓ రక్తపింజర అడ్డువచ్చింది. దాని మీద నుంచే బండిని తోలింది కాక, తీసుకుని మెడలో వేసుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక ఏమయ్యిందో ఏమో బండిని ఆపేసి కసిదీరా దానిని కొరికేశాడు. అది చూసి దారిన పోయేవారు షాక్‌కు గురయ్యారు. కొందరు సెల్‌ఫోన్లలో వీడియో తీసుకున్నారు. పోలీసులు వచ్చేసరికి పాము ఎప్పుడో చనిపోయింది. ఆ పాముకు విషం ఉంటుందని తనకు తెలియదని, అంతకుముందు ఓసారి తనదారికి అడ్డొచ్చి విసిగించిందని కుమార్ మీడియాతో చెప్పాడు.

Drunk man bit a snake into pieces in Karnataka
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News