Friday, April 19, 2024

మేకపై మందుబాబు అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

Rape

 

కోల్‌కతా: సమాజంలో మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లతో పాటు మూగ జీవులకు సమాజంలో భద్రత కరువైంది. రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో కామాంధుల నుంచి మానాలు కాపాడుకోవడం కోసం మహిళలు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా ఓ కామాంధుడు మేకపై అఘాయిత్యం చేస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో గ్రామస్థులు అతడిపై మూక దాడి చేసిన సంఘటన తూర్పు బుర్దాన్ జిల్లాలోని పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. టికపారా గ్రామంలో ఓ వ్యక్తి తన మేకను దొడ్లో కట్టేసి బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న పొరుగింటి వ్యక్తి మేకతో సంభోగం చేస్తుండగా యజమాని గమనించాడు. వెంటనే గ్రామస్థుల సహాయంతో అతడిని పట్టుకొని మందుబాబుపై మూక దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మందుబాబును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అయోధ్య ప్రాంతం నవాబ్‌గంజ్‌లో ఆవుపై వ్యక్తి అఘాయిత్యం చేస్తున్న ఘటన అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయింది. ఆ కామాంధుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Drunk Man tries to ‘rape’ goat in Burdwan District
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News