Saturday, April 20, 2024

మద్యం తాగి విమానంలో వాంతులు.. టాయిలెట్ వద్ద మల విసర్జన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియాలో మూత్ర విసర్జన ఘటన మరువక ముందే ఇండిగో విమానంలో మరో దుశ్చర్య చోటు చేసుకుంది. మార్చి 26న గువాహటి నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు తప్పతాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. టాయిలెట్ వద్ద మల విసర్జన చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది , తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

దీనికి సంబంధించిన ఫోటోనుఅదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగు చూసింది. ఆ పరిస్థితుల్లో బాధ్యతగా వ్యవహరించిన విమాన సిబ్బందిని ఆయన ప్రశంసించారు. “ ఓ వ్యక్తి తప్పతాగి సీట్ల వద్దనే వాంతి చేసుకున్నాడు. టాయిలెట్ వద్ద మల విసర్జన చేశాడు. శ్వేత అనే యువతి ఆ చోటంతా శుభ్రం చేసింది. అమ్మాయిలందరూ పరిస్థితిని చక్కదిద్దారు. మహిళా శక్తికి నా సెల్యూట్ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ చూసిన యూజర్లు సంఘటనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విమానాల్లో ఇటీవల మద్యం మత్తులో కొందరు ప్రయాణికులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివి అరికట్టాలంటే విమానాల్లో మద్యం తాగడం నిషేధించాలని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News