Home తాజా వార్తలు పోలీస్‌స్టేషన్‌లో యువతి, యువకుడి వీరంగం!

పోలీస్‌స్టేషన్‌లో యువతి, యువకుడి వీరంగం!

Drunken Young Couple Nuisance

హైదరాబాద్: పూటుగా మద్యం సేవించి అడ్డదిడ్డంగా వాహనం నడుపుతూ పలువురిని గాయపరచడమేకాకుండా అలా ఎందుకు చేశారని అడిగినందుకు పోలీసులపై చిందులేశారో యువజంట. వివరాల్లోకి వెళితే… మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో గత అర్ధరాత్రి ఓ యువతి, యువకుడు వీరంగం సృష్టించారు. నండూరి కిరణ్‌రెడ్డి, అనుగుప్తా అనే జంట మొతాదుకుమించి మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్‌రెడ్డి, అనుగుప్తాలను అదుపులోకి తీసుకుని పిఎస్‌కు తరలించారు.

అయితే, ఈ జంటను విచారిస్తున్న సమయంలో వారు పోలీసులకు సహకరించకపోగా న్యూసెన్స్ చేశారట. పోలీస్‌స్టేషన్‌లోని సామాగ్రిని పగులగొట్టి వీరంగం సృష్టించారు. పోలీసుల బ్రీత్ ఎనలైజింగ్ టెస్టులో కిరణ్ రెడ్డి 137 పాయింట్లు, అనుగుప్తా 120 పాయింట్లు మద్యం సేవించినట్లు తేలింది. కాగా, గతంలో కూడా కిరణ్‌రెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో 13 కేసులు, ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రౌడీషీట్‌ కూడా నమోదైనట్లు తెలిపారు. అలాగే జూబ్లీహిల్స్‌లో అతనిపై పిడియాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు. అంతేగాక హైదరాబాద్‌‌లోని అన్ని పబ్‌లలోనూ కిరణ్‌రెడ్డిపై లై బ్యాన్ సైతం ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు.

Drunken Young Couple Nuisance in Police Station

Telangana Breaking News