Home భద్రాద్రి కొత్తగూడెం తాగిన మైకంలో యువకుల వీరంగం!

తాగిన మైకంలో యువకుల వీరంగం!

Drunken Youth

భద్రాద్రి కొత్తగూడెం: తాగిన మైకంలో కొందరు యువకులు పోలీసులను దుర్భాషలాడుతూ హల్‌చల్‌ చేశారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి వీరంగం సృష్టించారు. పోలీసుల కథనం ప్రకారం… ఎన్నికల నేపథ్యంలో గత రాత్రి లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ నరేష్‌ తన సిబ్బందితో రాత్రివేళ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్‌ పరిధిలో నలుగురు యువకులు పూటుగా మద్యం సేవించి పోలీసులతో ఘర్షణకు దిగారు. ‘మా సంగతి తెలియదు, ఇక్కడ నుంచి బదిలీ చేయిస్తాం, అవసరమైతే సస్పెండ్‌ చేయిస్తాం’ అంటూ ఎస్ఐతో వాగ్వివాదానికి దిగారు. సదరు యువకులు మద్యం తాగి ఉండడంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించడంతో ఎస్ఐ నరేష్‌ త్రీ టౌన్‌ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ఆదేశాలతో ఆ నలుగురు యువకులపై త్రీ టౌన్‌ ఎస్ఐ బి. శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Drunken Youth Abusing with Cops in Bhadradri

Telangana Breaking News