Home తాజా వార్తలు వాట్సాప్ మెసేజ్ తో తప్పించుకుంటున్న మందుబాబులు

వాట్సాప్ మెసేజ్ తో తప్పించుకుంటున్న మందుబాబులు

Drunken Drivingహైదరాబాద్ : హైదరాబాద్ జంటనగరాల్లో పోలీసులు అనునిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వీకెండ్ లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా ఉంటాయి. ఈ క్రమంలో మోతాదుకు మించి మద్యం తాగిన వారిని ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేసి జరిమానా విధించడం, జైలకు తరలించడం జరుగుతుంది. అయితే పోలీసు తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మద్యం ప్రియులు కొత్తదారులను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే మద్యం ప్రియలు సరికొత్తగా వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. వీకెండ్ లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ను విస్తృతంగా చేస్తారు. ఈ క్రమంలోనే మద్యంప్రియులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. నగరంలో ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగితే ఆ దారిన వెళ్లొద్దని మద్యం ప్రియులు తమ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెడుతారు. దీంతో అటుగా వచ్చే మద్యం ప్రియులు పోలీసులకు దొరక్కుండా మరో దారిలో వెళ్లిపోతున్నారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో యువకులు, విద్యార్థులు, మధ్య వయస్కులు, నటీనటులు కూడా ఉన్నారు. ఇదే విషయంపై అడిషనల్ ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీసు అనిల్ కుమార్ స్పందించారు. మద్యంప్రియుల వాట్సాప్ గ్రూపుల ఏర్పాటు గురించి తమకు తెలిసిందని, వారిని నియంత్రించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. వీలున్నవంతవరకు మద్యంప్రియులను పారిపోకుండా నగరంలోని పలు చోట్ల తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి హైదరాబాద్ లో 15,133 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, ఏప్రిల్లో 2,215 కేసులు, జూన్ లో 2,770 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు.

Drunkers Escaping With WhatsApp Messages