*అధికారుల కనుసైగల్లో భారీగా అక్రమ దందా
*ప్రతి రోజు ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యం
*పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న సివిల్‌సప్లై అధికారులు
మన తెలంగాణ/కొత్తకోట: మండల కేంద్రంలో జోరుగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతున్న చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు వాపోతున్నారు. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని అరికట్టేందుకే ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికి అక్రమ రేషన్ బియ్యంఅంతటితో ఆగిపోకుండా ప్రతి రోజు రాత్రి వేళల్లో గద్వాల, పెబ్బేరు, అన్నాసాగర్‌కు చెందిన పేరుమోసినబడా అక్రమ వ్యాపారం ముఠా స్వయంగా రాత్రి వేళల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తీసుకుపోవడం జరుగుతుందని పలువురు ఆరోపి స్తున్నారు. ఇంత జరుగుతున్న సివిల్ సప్లై అధికారులు,ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.గత రెండు రోజుల క్రితం కొత్తకోటలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారులను పట్టుకునేందుకు రెండు మూడు రోజులు నామ మాత్రంగా కొత్తకోటలో సంచరించి వెనక్కి దిరిగి వెళ్లారే గాని ప్రణాళికా బద్దంగా పట్టుకోవడంలో విఫలం చెందడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒక అధికారి ముందే సమాచారం ఇచ్చి తనిఖీలకు వస్తుండడం తో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారస్తులు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న పట్టుకోవడంలో నిర్లక్షం వహించడమేమిటని పలువురు వాపోతున్నారు.గత కొంత కాలంగా సివిల్ సప్లై అధికారి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారుల దగ్గరకు వెళ్లి నెల నెల మాముళ్లను పుచ్చుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రేషన్ బియ్యం, నిత్యావసర వస్తువులు పక్కా దారి పట్టకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారు లపై ఉందని పలువురు కోరుతున్నారు.