Home రాష్ట్ర వార్తలు మతోన్మాదం వల్ల పెనుముప్పు

మతోన్మాదం వల్ల పెనుముప్పు

suravaram-sudhakar-reddyబిజెపికి, దేశానికి నష్టం
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్య

మన తెలంగాణ/ హైదరాబాద్: మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రీతిలో ఉన్న బిజెపి ప్రభుత్వ ఆలోచన విధానం సమాజాన్ని, దేశాన్ని మతపరమైన విభజనకు దారి తీస్తుందని సిపిఐ జాతీయ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్య దర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, శాసనసభ్యులు రవీంద్ర కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈర్ల నర్సింహ, పశ్యపద్మలతో కలిసి మఖ్దూంభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కొంత అసహనం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికైనా అంగీకరిండచం సంతోషకరమని, అయితే ఆయన చెప్పిన దానికంటే అసహనం ఎక్కువస్థాయిలో ఉందని సురవరం అన్నారు. అవార్డులను వెనక్కి ఇచ్చే సిన రచయితలు, మేధావులపై అధికార పక్షం, మతో న్మాదశక్తులు ప్రకటనల దాడి కొనసాగించడం సరి కాద న్నారు.

ఇంత మంది మేధావులు అసంతృప్తి వ్యక్తం చేసి నా బిజెపి ప్రభుత్వం పెరుగుతున్న అసహన ధోరణిపై ఆలోచన చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఆలోచనలను కట్డిడిచేయక పోతే బిజిపి నష్టపోవడమే కాకుండా దేశం కూడా నష్ట పోతుందన్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యం లో అసహనం, మతతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తం గా డిసెంబర్ మాసంలో ప్రచార కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. బీహార్ ఎన్నికల తరువాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ప్రభుత్వ విధానాలను మార్చుకోకపోగా, 15 కీలక రంగాల్లో ఎఫ్‌డిఐని మరింత విస్తృతపరిచిందన్నారు. ఢిల్లీ, బీహర్ శాసనసభ ఎన్నిక ల్లో, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిందని, ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక తీర్పు అని సురవరం వ్యాఖ్యా నించారు. గతంలో పలు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలి చిన సందర్భాల్లో ఆ తీర్పును కేంద్ర ప్రభుత్వ విధానాల కు ప్రజలిచ్చిన మద్దతుగా అభివర్ణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఒఎన్‌జిసి సహా పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.60వేల కోట్లు సమీకరించాలని భావించడాన్ని తప్పు బట్టారు. బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీ నుంచి క్యాపిటల్ గెయిన్స్ కింద రావాల్సిన రూ.21వేల కోట్లు , వొడాఫోన్ నుండి రావాల్సిన రూ.10,500 కోట్లు వసూలు చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణ అవసరం లేదన్నారు. భారతదేశ విదేశాంగ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా మార్చు తుండడం పట్ల సురవరం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు. భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్నే కొన సాగించాలని డిమాండ్ చేశారు. అమెరికా ఏ దేశ అంత ర్గత వ్యవహారంలో జోక్యం చేసుకున్నా అక్కడి ప్రభుత్వం కూలిపోవడమే కాకుండా తీవ్రవాద శక్తులు పెచ్చుమీరు తాయన్నారు. ఇందుకు అఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, లెబెనాన్ దేశాలను ఉదహరించారు. అమెరికాకు అను కూలంగా విదేశాంగా విధానాన్ని మార్చుకుంటే మనకు కూడా సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరుచు కోవాలని, బేషరతుగా చర్చలకు సిద్ధమైన పాకిస్తాన్‌తో భారత ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు.

ఆ జీవోల రహస్యమేమిటి?: తెలంగాణ ప్రభుత్వం ఇటీ వల జారీ చేసిన 350 జిఒలలో 150 జిఒలను కాన్షి డెన్షియల్ (రహస్యం)గా ఉంచడాన్ని సురవరం తప్పు బట్టారు. ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు. కేవలం యూనిట్‌కు రూ.3.50లకే జెన్‌కో నుంచి దొరికే విద్యుత్ ను కాకుండా రూ.5.50 ఖర్చు చేసి ప్రైవేటు కంపెనీల నుండి విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు.ఈ కొను గోలు ద్వారా ట్రాన్స్‌కోపై రూ.5వేల కోట్ల భారం పడు తోందని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖర్చుతో చండీయాగం చేస్తున్నారని తాను అన్న మాటలపై సిఎం బాధపడినట్లు చేసిన వ్యాఖ్యలను సురవరం ప్రస్తావించారు. చండీయాగం ప్రభుత్వ ఖర్చుతో కాకుండా సిఎం స్వంత ఖర్చుతో చేయడం మంచిదేనని, అయితే వ్యక్తిగత ఖర్చుకు సైతం పరిమితి ఉండాలని అన్నారు. గోదావరి పుష్కరాలు, తిరుపతి వెంకన్న, కనకదుర్గకు బంగారు ఆభరణాలు వంటి మొక్కులకు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం, బతుకమ్మకు కోట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. పుష్కరాలు వంటి కార్యక్రమాలకు ప్రజలకు అవసరమైన రవాణా, ఆరోగ్య, భద్రత సౌక ర్యాలు కల్పిస్తేచాలని, అంతే తప్ప ప్రభుత్వమే మొత్తం మీద వేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వమే పండుగలు నిర్వహించడం రాజ్యాంగం ప్రకటించిన లౌకికకత్వ భావనకు వ్యతిరేకమన్నారు.

ఫిరాయింపులే టిఆర్‌ఎస్‌కు గుదిబండ:చాడ
ఎంఎల్‌సి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తప్పుబట్టారు. ఈ చర్య భవి ష్యత్తులో టిఆర్‌ఎస్‌కు గుదిబండలుగా మారుతాయ న్నారు. టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి పలవురు ఎంపిటిసి లు, జెడ్‌పిటిసిలు పార్టీ ఫిరాయించారని, అయితే ఖమ్మం లో సిపిఐ, సిపిఐ(ఎం) సభ్యులు అధికారపార్టీ ప్రలోభాల కు లోనుకాకుండా తగిన గుణపాఠం చెప్పారన్నారు. 6న మతసామరస్యంపై వామపక్షాల ఆధ్వర్యంలో సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పువ్వాడ నామినేషన్‌కు చాడ, తమ్మినేని
ఖమ్మం సాన్థిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి వామపక్షాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు శనివారం నామినేషన్ వేస్తారని చాడ తెలిపారు. కార్య క్రమంలో తనతో పాటు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారన్నారు. నల్లగొండలో సిపిఐ(ఎం) పోటీ చేస్తే బలపరుస్తామని, మిగతా చోట్ల స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు.