Home తాజా వార్తలు యుద్ధం నేపథ్యంలో లవ్ స్టోరీ.. (వీడియో)

యుద్ధం నేపథ్యంలో లవ్ స్టోరీ.. (వీడియో)

‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఇప్పుడు ‘మహానటి’ నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అందాల రాక్షసి, పడి పడి లేచే మనసు వంటి మనసుని హత్తుకొనే సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. లెఫ్టినెంట్ రామ్.. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ అనౌన్సమెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. బుధవారం దుల్కర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గ్లిమ్స్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. ఈ మూవీ యుద్ధం నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960 బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడినట్లు అర్థమవుతోంది. ఇందులో దుల్కర్… లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపిస్తున్నాడు. దుల్కర్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Dulquer Salmaan’s Lieutenant Ram Glimpse Released