Saturday, April 20, 2024

డూప్లికేట్‌తో పాఠాలు.. ప్రభుత్వ టీచర్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

School

భోపాల్: పిల్లలకు పాఠాలు చెప్పడానికి తీరిక లేని ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తన స్థానంలో 8వ తరగతిలోనే చదువుకు మంగళం పాడిన మరో వ్యక్తిని నియమించుకుని ఠంచనుగా నెల జీతం తీసుకుంటున్న సంఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లో విద్యావ్యవస్థ దీనస్థితికి అద్దం పట్టే ఈ సంఘటన ఖర్గావ్ జిల్లాకు 45 కిలోమీటర్ల దూరంలోని దేవ్లీ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఎలా వెలుగుచూసిందంటే…జిల్లా డిప్యుటీ కలెక్టర్ రాహుల్ చౌహాన్ గురువారం దేవ్లీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.

ఆ సమయంలో దయాల్ సింగ్ అనే వ్యక్తి టీచరుగా పిల్లలకు పాఠాలు చెబుతున్నాడు. అయితే డిప్యుటీ కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు దయాల్ సింగ్ సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన డిప్యుటీ కలెక్టర్ నిగ్గదీసి అడిగే సరికి దయాల్ సింగ్ అసలు నిజం చెప్పేశాడు. రామేశ్వర్ రావత్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనకు బదులుగా విధులు నిర్వహిస్తే నెలకు రూ. 4000 ఇస్తానన్నాడని అతను ఒప్పుకున్నాడు. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన రామేశ్వర్ రావత్‌తోపాటు జబ్బార్ సింగ్ అనే మరో టీచర్ కూడా పాఠశాలలో లేడు.

డిప్యుటీ కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలిస్తే వారం రోజులుగా వారిద్దరూ సంతకాలు లేవు. అయితే వారిద్దరూ 15 రోజులకోసారి స్కూలుకు వచ్చి సంతకాలు చేస్తారని దయాల్ సింగ్ చెప్పాడు. తనిఖీ జరిగిన సమయంలో స్కూలులో 23 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గ్రామస్తులను పిలిచి డిప్యుటీ కలెక్టర్ విచారించగా ఆ ఇద్దరు టీచర్ల మొహం కూడా తాము చూడలేదని చెప్పారు. వెంటనే ఆ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన డిప్యుటీ కలెక్టర్ నకిలీ టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Duplicate teacher found in MP govt school, Class 8 dropout caught teaching at school when Deputy Collector conducted surprise visit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News