Friday, March 29, 2024

భాగ్యనగరవాసులకు మరో కనువిందు

- Advertisement -
- Advertisement -

Durgam Cheruvu Cable Bridge will start tomorrow

రేపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం, అత్యాధునిక టెక్నాలజీని వాడిన ఇంజనీర్లు, కేబుల్ బ్రిడ్జిపైకి వెళితే మైమరిచిపోతాం.. రూ.184 కోట్ల వ్యయం..22 నెలల సమయం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చారిత్రక కట్టడం ప్రారంభం కానుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిను శనివారం పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు ప్రారంభించనున్నన్నారు. రూ.184 కోట్ల వ్యయంతో జర్మన్ మేడ్ టెక్నాలజీతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి భారత దేశంలోనే అతిపెద్దది. మరో బ్రిడ్జి గుజరాత్‌లోని నరాa్మద నదిపై నిర్మించారు. అయితే ఆ బ్రిడ్జి కంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు రేట్లు పెద్దది. 2017 ఏప్రిల్ 26న పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదగా శంకుస్థాపన జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని 18 నెలలలో పూర్తి చేయాలని లక్షంగా నిర్దేశించుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల కొంత ఆలస్యమైంది. అత్యాధునికి టెక్నాలజీతో 8 దేశాలకు చెందిన ఇంజనీరుల సహాయ సహకారాలతో ఎల్ అండ్ టి సంస్థ బ్రిడ్జిను నిర్మాణాన్ని 22 నెలల కాలంలో పూర్తి చేసింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికు అత్యాధునికి లైటింగ్ మరో ప్రత్యేకతగా నిలవనుంది.

ఈ తరహా నిర్మాణం దేశంలోనే మొట్టమొదటి కావడం విశేషం. దుర్గం చెరువు నీటిమట్టానికి 20 మీటర్ల ఎత్తులో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని పూర్తిగా తీగలతో అనుసంధానం చేయబడింది. దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి 425మీటర్ల పొడవున నీటిపై తేలియాడనుంది. బ్రిడ్జి నిర్మాణానికి ఇరువైపులా చివర్లలో రెండు పైలాన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఇక పిల్లరు ఎత్తు 75 మీటర్లు కాగా, మరో పిల్లరు ఎత్తు 57 మీటర్లు. ఈ రెండు పిల్లర్లకు కేబుల్స్‌తో అనుసంధానం చేయడంతో బ్రిడ్జి నీటిపై తేలియాడుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జికి ఇరువైపులా మరో 0.5 కిలో మీటర్ల అప్రోచ్ రోడ్డు ఉండనుంది. దీంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పొడవు మొత్తం 736 మీటర్లు ఉండనుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ఒక అద్భుతమైతే దీనికి అమర్చనున్న లైటింగ్ మరో అత్యాద్భుతంగా నిలవనుంది. చెరువు నీటి లోపలలో ఏర్పాటు చేయనున్న లైటింగ్ భాగ్యనగర వాసులకు కన్నులవిందు చేయనుంది.

అదేవిధంగా చెరువు పరిసరాల ప్రాంతాన్ని రూ.3.5 కోట్ల వ్యయంతో పూర్తిగా సుందరీకరణంగా మార్చారు. అంతేకాకుండా పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం నిర్మిచడంతో పాటు సైక్లింగ్ ట్రాక్, చెరువులో బోటింగ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం రూ.90 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా సరస్సును ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హెటెక్, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే ప్రయాణికులకు సుమారు 2.5 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. దీంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 మార్గం ఎలివేటేడ్ కారిడార్‌ను సైతం సమాంతరంగా నిర్మించారు. కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో పాటు ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News