Home తాజా వార్తలు బాసరలో దసరా ఉత్సవాలు

బాసరలో దసరా ఉత్సవాలు

Dussehra Celebrations Start in Basara

నిర్మల్ : బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాల కోసం అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించి, పలు రకాల పూలతో తీర్చిదిద్దారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dussehra Celebrations Start in Basara