Thursday, April 18, 2024

వరుస ఓటములతో సతమతం.. చెన్నైకి మరో షాక్

- Advertisement -
- Advertisement -

Dwayne Bravo withdraws from IPL

 

దుబాయ్‌: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్‌  డ్వేన్‌ బ్రావో గజ్జల్లో గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా గత శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్రావో ‌ బౌలింగ్‌ను వేయలేకపోయిన విషయం తెలిసిందే. గాయం కారణంగా బ్రావో ఇక మ్యాచ్‌లు ఆడలేడని, ఈ ఐపిఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడని  చెన్నై సిఇఒ  కాశీ విశ్వనాథన్‌ వెల్లడించారు. ఐపిఎల్‌ 2020 సీజన్‌లో బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయంతో అతడు మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. ఒకటి లేదా  రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడని విశ్వనాథన్‌ వివరించారు. అతడు కోలుకోవడానికి వారాల సమయం పట్టే అవకాశం ఉన్నదని సిఎస్ కె కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News