Home తాజా వార్తలు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇ-బోర్డింగ్‌ను ప్రారంభించిన ఎమిరేట్స్

హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇ-బోర్డింగ్‌ను ప్రారంభించిన ఎమిరేట్స్

E-boarding for emirates passengers at Hyd airport

 

మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఇ-బోర్డింగ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ అంతర్జాతీయ క్యారియర్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పేపర్‌లెస్ ఈబోర్డింగ్‌తో అనుసంధానమయ్యాయి. తాజాగా ఎమిరేట్స్ ఈ జాబితాలో చేరింది. దుబాయికి వెళ్లే ప్రయాణీకులు, ఇకె 527 విమానంలో ఎక్కడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ దీనిని ఉపయోగించుకుంది.

జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ విమానాల ప్రయాణికులకూ మొదటి నుంచి చివరి వరకు పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్‌ను అందించిన మొదటి, ఏకైక విమానాశ్రయంగా ఘనత పొందింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో 2020 డిసెంబర్ నుండి అంతర్జాతీయ విమానాలకు, స్థానికంగా అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ పరిష్కారాన్ని ప్రారంభించి, భారతదేశంలో ఈ పని చేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా మారింది. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిఇఒ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, ఎమిరేట్స్ ఈ-బోర్డింగ్ విధానాన్ని ఉపయోగించడం ప్రారంభించినందుకు సంతోషిస్తున్నామని అన్నారు.

E-boarding for emirates passengers at Hyd airport