Friday, April 19, 2024

నేటి నుంచి ఎంసెట్ దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

EAMCET applications start from today
ఇసెట్,ఐసెట్,
లాసెట్ దరఖాస్తులు సైతం ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు జులై 14, 15,18, 19, 20 తేదీలలో జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులు రూ.400, ఇతరులు రూ. 800, రెండూ రాసే అభ్యర్థులు రూ.1600 చెల్లించాలి. జులై 14 నుంచి 5 రోజులపాటు ఎంసెట్ జరుగనుంది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బి.టెక్, బి.ఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు జులై 13న ఇసెట్ పరీక్ష జరుగనుంది.

ఇతర పరీక్షలకు నేటి నుంనే దరఖాస్తులు

పాలిటెక్నిక్ డిప్లొమా, బిఎస్‌సి గణితం చదివిన విద్యార్థులు బి.టెక్,బి.ఫార్మసీ రెండో సంవత్సరంలో(లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌కు బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాలి. అలాగే రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ పరీక్షకు బుధవారం నుంచే దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలకు నిర్వహించే పిజిఇసెట్‌కు బుధవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

రేపటి నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు

రాష్ట్రంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఇడి) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌కు గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు రూ.650, ఎస్‌సి, ఎస్‌టిలు రూ .450 చెల్లించాలి. అలాగే ఎం.టెక్, ఎం.ఫార్మసీలో ప్రవేశాల కోసం పిజిఇసెట్‌కు ఏప్రిల్ 12 నుంచి జూన్ 22 వరకు పిజిఇసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.

ఈసారి ఎంసెట్‌కు పెరుగనున్న దరఖాస్తులు

ఎంసెట్‌కు రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షలమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందులో 90 శాతం వరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులే ఉండనున్నారు. గత ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962 మంది, అగ్రికల్చర్, ఫార్మసీలకు 86,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసింది. ఈ క్రమంలో ఎంసెట్ దరఖాస్తులు గత ఏడాది కంటే భారీగా పెరుగనున్నట్లు తెలుస్తోంది. ఇసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News