Home తాజా వార్తలు నేడు ఎంసెట్ ఫలితాలు

నేడు ఎంసెట్ ఫలితాలు

EAMCETహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు గురువారం పదకొండు గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంటర్ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25శాతం మార్కులు, ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఎంసెట్‌లో కనీసం 25 శాతం మార్కులు , అంటే 160కి 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్లు , ఎస్‌సి, ఎస్‌టిలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. అయితే ఇంటర్‌లో మాత్రం సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం, ఎస్‌సి, ఎస్‌టిలకు 40 శాతం మార్కులు తప్పనిసరి చేశారు.