Home తాజా వార్తలు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో స్వల్ప భూకంపం

Earthquake At Nagar Kurnool Monday Morningనాగర్‌కర్నూల్‌ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం ఉదయం  స్వల్ప భూకంపం సంభవించింది.   అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప  తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్ల మీదకు భయంతో పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చ