Home జాతీయ వార్తలు మణిపూర్ లో భూకంపం… రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదు

మణిపూర్ లో భూకంపం… రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదు

Earthquake

 

ఇంఫాల్: మణిపూర్‌లోని సెనపటి జిల్లాలో గురువారం మద్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదయిందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం సెనపటిలో ఉందని వెల్లడించారు. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలలో కూడా స్వల్పంగా భూమి కంపించింది. భూమి కంపించడంతో ప్రజల భయాందోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెనపటి ప్రాంతంలో రెండు లేదా మూడు భవనాలు కూలిపోయినట్టు సమాచారం. 

 

Earthquake Hits Senapati District in Manipur