Home జాతీయ వార్తలు కర్నాటక, జార్ఖండ్ లలో భూకంపం

కర్నాటక, జార్ఖండ్ లలో భూకంపం

 Earthquake in Karnataka and Jharkhand

ఢిల్లీ : కర్నాటక, జార్ఖండ్ లలో శుక్రవారం భూకంపం వచ్చింది. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.7 గా నమోదైంది. శుక్రవారం ఉదయం 6.55 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. కర్నాటకలోని హంపిలో సైతం భూకంపం వచ్చిందని, రిక్టర్ స్కేల్ పై భూ కంప తీవ్రత 4.0గా నమోదైందని అధికారులు తెలిపారు. హర్యానాలోని రోహతక్ లో 4.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.  ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.