Home జాతీయ వార్తలు మ‌హారాష్ట్రలో భూకంపం

మ‌హారాష్ట్రలో భూకంపం

Earthquake In Maharashtra On Sunday Morningముంబయి : మ‌హారాష్ట్ర లోని కొల్హాపూర్‌లో ప్రాంతంలో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదైందని  నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం  భూ అంత‌ర్భాంగంలో 5 కి.మీ. లోతులో కేంద్రీకృతమైందని వారు చెప్పారు. ఒక్కారిగా భూకంపం రావడంతో ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.