Home అంతర్జాతీయ వార్తలు ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం

 

జకర్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో భూమి కంపించినట్లు ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఈ తీవ్రతతో భూమి రెండుసార్లు కంపించింది.  మొదటగా మధ్యాహ్నం 2.06 గంటలకు తుబాన్ కు 56 కి.మీ దూరంలో భూమి ప్రకంపనలు చోటుచేసుకున్నాయని, భూకంప కేంద్ర నాభి 656 కి.మీ లోతులో ఉన్నట్లు భూగర్భ పరిశోధన శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని నిమిషాల తర్వాత రెండోసారి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించిన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Earthquake measuring 6.1 magnitude in Indonesia