Friday, March 29, 2024

జావద్ తుపాను ముప్పు

- Advertisement -
- Advertisement -

East Coast Railway cancelled the operation of 95 trains

మూడు రోజులకుగాను 95 రైళ్లు రద్దు
ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం

భువనేశ్వర్: ఒడిశా తీరాన్ని జావద్ తుపాను తాకనుందన్న సూచనలతో తూర్పు కోస్తా రైల్వే గురువారం నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ప్రయాణికుల రక్షణ, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా డిసెంబర్ 2 నుంచి 4 వరకు వివిధ ప్రదేశాలలో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను తూర్పు కోస్తా రైల్వే రద్దుచేసింది. ఇదిలావుండగా బంగాళాఖాతం ఆగ్నేయం దిశలో, దాని పక్కనే ఉన్న అండమన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయవ్యం దిశలో కదులుతోందని భారత వాతావరణ శాఖ గురువారం మధ్యాహ్నం 12.43కు తెలిపింది. ఈ తుపాను డిసెంబర్ 4న దక్షిణ ఒడిశా తీరాన్ని చేరవచ్చని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News