Tuesday, February 7, 2023

చిరుతిళ్లు తినటం మానాలి

- Advertisement -

Junk-Foodకీళ్ల నొప్పి పోయేది ఎలా..?

ప్రశ్న: నా వయసు 36 సం॥లు. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పరిచేస్తున్నాను. నా బరువు 60కేజీలు. కాళ్ళు, చేతులు నీరు పట్టి, నొక్కితే గుంటలు పడుతాయి. కీళ్ళు వాపును కలిగి ఉండి నొప్పి పెడుతాయి. నాకు చల్లని వాతావరణం, చన్నీటి స్నానం హయిగా ఉంటాయి. రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.

– రజిని, ఖమ్మం

జ : మీ సమస్యకు ‘ఎపిస్.’ అనే మందు సరిపోతుంది ఈమందును 200 పోటేన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు , సాయంత్రం ఒక డోసు చోప్పున మూడు నెలల పాటు వాడండి. అట్లనే ఆహరపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహర పదార్ధాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి, పాదరక్షలు సౌకర్యవంతముగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా త్రాగాలి తాజా కూరగాయలు నిత్యం ఆహరంలో ఉండే విధంగా చూసుకోవాలి.

మలబద్దకంతో.. బాధ..

2. ప్రశ్న: నా వయస్సు 28 సంవత్సరాలు. శారీరక శ్రమ లేకుండా, మలబద్దకంతో బాధ పడుతూ తరుచుగా మలబద్దకం నివారణ మాత్రలు వాడుతుంటాను. అలాగే తరుచుగా మల విసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెలితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న సర్జన్‌ను సంప్రదించగా ఫైల్స్ అని చెప్పారు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.

– ప్రతాప్, వరంగల్

జ : మీ సమస్యకు ‘నక్స్‌వామిక’ అనే మందు సరిపోతుంది ఈ మందును 200 పోటేన్సీలో మీరు వారం రోజులకపాటు ఉదయం ఒక డోసు , సాయంత్రం ఒక డోసు చొప్పున ఒక వారం పాటు వాడగలరు.అనంతరం ప్లాసిబో 30 అనే మందును ఉదయం 8, సాయంత్ర 8గోళీల చొప్పున 15 రోజుల పాటు వాడగలరు. అలాగే పీచు పదార్థలు ఎక్కువగా ఉన్న అహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4నుడి 5 లీటర్లు). ప్రతి రోజు వ్యాయామం చేయాలి. రోజు మల విసర్జన సాఫీగా జరుగునట్లుగా చూసుకోవాలి. మద్యం అతిగా సేవించుట, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు , మాంసాహరం, చిరుతిండ్లు తినటం మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, ధ్యానం చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles