Friday, April 19, 2024

ఎబోలా వైరస్ నివారణలో కొత్త వెలుగు

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద పశ్చిమాఫ్రికా ఎబోలా వైరస్ బాధిత దేశంగా అల్లాడుతోంది. గినియా, లైబీరియా, సియెర్రా, లియోనె ప్రాంతాల్లో 2013 నుంచి 2016 వరకు దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోగా, 2018 2019 మధ్యకాలంలో మరో 2000 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.2018 లో ప్రపంచ ఆరోగ్యసంస్థ సహకారంతో ఇంటర్నేషనల్ రీసెర్చి గ్రూప్ కాంగోలో ఎబోలా వైరస్ ప్రయోగాత్మక చికిత్సలు ప్రారంభించింది. అయినా ఎబోలా నిర్మూలన సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రెజెనెరాన్స్ ఆర్‌ఇజిఎన్ ఇబి 3, మోనోక్లోనల్ యాంటీబాడీ ఎంఎబి 114 అనే రెండు ఔషధాలు తెరపైకి వచ్చాయి.

కాంగోలో ఈ రెండిటినీ ఎబోలా వైరస్ బాధితులపై ప్రయోగించిన యాంటీబాడీలను ఉపయోగించి అభివృద్ధి చేశారు. వీటితో కాంగోలో రోగులందరికీ చికిత్స చేయడానికి వీలవుతుందని అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ వెల్లడించింది. జెడ్‌ఎంఎపిపి, రెమ్‌డెసివిర్ ఔషధాల చికిత్స కన్నా పై రెండు ఔషధాలు ఎక్కువ శాతం జీవితాన్ని నిలబెట్టగలవని తేలింది. జెడ్‌ఎంఎపిపి వినియోగించిన రోగుల్లో 46 శాతం మంది, రెమ్‌డెసివిర్ వినియోగించిన రోగుల్లో 53 శాతం మంది 2018 19 మధ్యకాలంలో చనిపోయినట్టు బయటపడింది.

వాటితో పోలిస్తే ఆర్‌ఇజిఎన్ ఇబి3 వినియోగించిన రోగుల్లో 29 శాతం మంది, ఎంఎబి114 వాడిన వారిలో 34 శాతం మంది చనిపోయారని ఏజెన్సీ వెల్లడించింది. దీన్ని బట్టి గతంలో కన్నా ఇప్పుడు కొత్తగా ప్రయోగాత్మకంగా నిరూపణ అయిన మందులే సమర్థంగా పనిచేస్తున్నాయని తేలింది. వీటితో చికిత్స నిర్వహించిన వైద్య కేంద్రాల్లో వైరస్ చాలా తక్కువ స్థాయిల్లో రక్తంలో కనిపించిందని ఏజెన్సీకి చెందిన డైరెక్టర్ చెప్పారు. ఆర్‌ఇజిఎన్ ఇబి 3 చికిత్సలో 94 శాతం మంది. ఎంఎబి 114 చికిత్సలో 89 శాతం మంది బతక గలిగారని రుజువయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News