Home జాతీయ వార్తలు అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్ 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు

Election-Commission

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం ప్రకటించారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ సెప్టెంబర్ 27న జారీ అవుతుంది. రెండు రాష్ట్రాలలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది., అక్టోబర్ 24న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని అరోరా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం గడువు నవంబర్ 9న, హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ 2న ముగిసిపోనున్నాయి.

EC announces assembly polls schedule for Maharastra and Haryana, Election Commision briefs media on Maharashtra & Haryana state Assembly elections