Saturday, April 20, 2024

లక్షద్వీప్ లోక్‌సభ ఉప ఎన్నిక నిలిపివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ లోక్‌సభకు ఫిబ్రవరి 27న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ దోషిత్వాన్ని, అతనికి విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ కేరళ హైకోర్టు ఈనెల 25న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లక్షద్వీప్ ఉప ఎన్నికను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ఓ కేసులో దోషిగా తేలడంతో అతనికి జైలు శిక్ష పడింది.

దీంతో భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం అతని లోక్‌సభ సభ్యత్వం రద్దయింది. ఇతర రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ పార్లమెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ పేర్కొంది. లక్షద్వీప్ ఉప ఎన్నిక ఆగినా, షెడ్యూల్ ప్రకారం వివిధ రాష్ట్రాల ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు మహారాష్ట్రలో రెండు, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News