Thursday, April 25, 2024

రామ్ గోపాల్ వ‌ర్మ‌కి భారీ జరిమానా..

- Advertisement -
- Advertisement -

ECE Fines to Ram Gopal Varma for 'PowerStar' poster

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల వర్మ ‘ప‌వ‌ర్ స్టార్’ అనే సినిమాని తెరకెక్కించి ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మో‌ష‌న్‌లో భాగంగా వర్మ పోస్ట‌ర్ లు వేయించాడు‌. అయితే, నిబంధ‌న‌ల‌కి విరుద్ధంగా సినిమా పోస్టర్లు వేయించాడ‌ని వర్మకు జిహెచ్ఎంసి రూ.4వేలు జరిమానా వేస్తూ నోటీసు పంపింది. తాజాగా, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ కూడా ఆర్జీవీకి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా ‘పవర్ స్టార్’ పోస్టర్లు అతికించడంపై సిఈసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ‌ర్మ‌కి రూ.88వేలు జ‌రిమానా విధించింది. ఓవైపు పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా ‘పవర్ స్టార్’ను తెరకెక్కించాడని పవన్ అభిమానులు వర్మపై దాడికి పాల్పడగా.. మ‌రోవైపు సిఈసి భారీ జరిమానా వేయడంతో వర్మ కంగుతిన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ECE Fines to Ram Gopal Varma for ‘PowerStar’ poster

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News