Friday, April 19, 2024

ముక్తార్ అన్సారీ ఆస్తులపై ఈడీ దాడులు

- Advertisement -
- Advertisement -

ED raids on Mukhtar Ansari properties

లక్నో : గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన ముక్తార్ అన్సారీ అక్రమ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఆయనకు, సన్నిహితులకు చెందిన 100 బినామీ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో పేర్లు బయటకు వచ్చిన వారు సోమవారం నుంచి ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ గత గురువారం నాడు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఘాజిపూర్, లక్నో, ఢిల్లీ లోని అన్సారీ , ఆయన సన్నిహితులకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. ఐదు సార్లు ఎమ్‌ఎల్‌ఎ గా గెలిచిన అన్సారీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని బాండా జైలులో ఉన్నారు. ఘజియాపూర్ జిల్లా యంత్రాంగం గత వారంలో రూ. 6 కోట్లు విలువ చేసే 1901 హెక్టార్ల భూములు రెండింటిని సాధీనం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో అన్సారీ ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News