Home తాజా వార్తలు నోట్ల రద్దు అక్రమాల పద్దులో ముసద్దీలాల్

నోట్ల రద్దు అక్రమాల పద్దులో ముసద్దీలాల్

Musaddilal Jewellers Caseహైదరాబాద్, విజయవాడలో
ఇడి సోదాలు, 145కిలోల బంగారం జప్తు
రూ. 110కోట్ల
విలువైన రద్దు నోట్ల
మార్పిడిపై దర్యాప్తు
5200మంది బోగస్ ఇన్వాయిస్‌ల గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జ్యువెల్లరీ దుకాణాల్లో ఇడి సోదాలు నిర్వహించి రూ. 82 కోట్ల విలువైన 145.89కిలోల బం గారాన్ని జప్తు చేసింది. రద్దైన పెద్దనోట్లను అక్రమంగా మార్పిడి చేశారన్న ఆరోపణలపై పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంపై ముసద్దీలాల్ దు కాణాలలో పాటు యజమాని కైలాస్‌గుప్తా తదితరులు నివాసాలలో అధికారులు సోదాలు నిర్వహించా రు. ఈనేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు కాగానే ముసద్దీలాల్ దుకాణదారులు పెద్ద ఎత్తున విక్రయాలు చేపట్టినట్లు  రికార్డులలో చూపించారు.

బ్యాంకు ఖాతాలతో పాటు వారికి సంబంధించిన మరికొన్ని ఖాతాలలోకి గంటల వ్యవధిలో రూ.110 కోట్లకు పైగా డిపాజిట్ అయినట్లు ఇడి దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో భారీగా డిపాజిట్ల మొత్తాలపై ఐటి అధికారులు అప్పట్లోనే ముసద్దీలాల్ దుఖాణాల్లో సోదాలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 5200 మంది నుంచి బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి 110 కోట్ల రూపాయల విలువైన రూ.2 వేల నోట్లను స్వీకరించి వారి ఖాతాల్లోకి తరలించినట్లు ఐటి శాఖ గుర్తించింది. సిసి కెమెరాల దృశ్యాల ప్రకారం ఆ సమయాల్లో తమ దుఖాణాలలో విక్రయాలు జరపలేదని ఐటి శాఖ తేల్చింది.

వాటిలో రూ. 80 కోట్ల రూపాయలు అష్టలక్ష్మి గోల్డ్, శ్రీబాలాజీ గోల్డ్ తదితర బంగారు వ్యాపారస్తులు, డీలర్లకు మళ్లించినట్లు ఇడి దర్యాప్తులో వెలుగుచూసింది. దీంతో ఆయా సంస్థలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేపట్టిన ఇడి అధికారులు హైదరాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జ్యువెలరీస్ దుఖాణాలు, సంస్థ యజమాని కైలాష్‌గుప్తా ఇళ్లు, శ్రీ బాలాజీ గోల్డ్ భాగస్వామి పవన్ అగర్వాల్, అష్టలక్ష్మి గోల్డ్ నీల్‌సుందర్ థారడ్, చార్టెడ్ అకౌంటెంట్ సంజయ్ సర్దా కార్యాలయాల్లో ఇడి శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో ముసద్దీలాల్ జ్యూవెలరీకి అనుబంధ సంస్ధలుగా ఉన్న వాటిపై నిఘా సారిస్తున్నామని, అనతికాలంలో ఆయా షాపులలోనూ సోదాలు చేపట్టనున్నట్లు ఇడి అధికారులు మీడియాకు వెల్లడించారు.

 

ED Raids on Musaddilal Jewellers