Friday, April 19, 2024

ఎంపి నామాకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

ED Summons to TRS MP Nama Nageswara rao

మనతెలంగాణ/హైదరాబాద్: ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు ఇళ్లు, కంపెనీల్లో సోదాలు చేపట్టిన ఇడి అధికారులు ఈనెల 25న విచారణకు హాజరు కావాలని బుధవారం సమన్లు జారీ చేశారు. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు ఇడి అధికారులు తెలిపారు. అలాగే మధుకాన్ కేసులో ఉన్న నిందితులందరికీ ఇడి సమన్లు జారీ చేసింది. కాగా, బ్యాంకు రుణాలు దారి మళ్లించిన ఆరోపణల మేరకు ఎంపి నామా నాగేశ్వరరావుకు చెందిన ఖమ్మం, హైదరాబాద్ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అదేవిధంగా మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో ఇడి అధికారులు ఏకకాలంలో 20 గంటల పాటు సోదాలు చేసిన విషయం విదితమే.

ఈ సందర్భంగా కీలక పత్రాలు, కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఇడి కీలక ఆధారాలు సేకరించింది. నగదు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల స్టేట్మెంట్ కూడా ఇడి అధికారులు రికార్డు చేసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఇడి నోటీసులో పేర్కొన్నారు.

ED Summons to TRS MP Nama Nageswara rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News