Friday, April 19, 2024

కేరళలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ కొనసాగుతున్నా పాఠాలను కోల్పోయేది లేదని నిరూపించేలా కేరళలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు సోమవారం విద్యావిభాగం ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ఇది సంకేతమైంది. ఫర్స్ బెల్ పేరుతో రాష్ట్ర సాధారణ విద్యా విభాగం విక్టర్స్ అనే ఛానల్ ద్వారా 11 వ తరగతి మినహా 1 నుంచి 12 తరగతుల వరకు ఈ ఆన్‌లైన్ తరగతులను ప్రసారం చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచనలతో ఇవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులు నేరుగా నిర్వహించడం సాధ్యం కానందున ఈ నిర్ణయం తీసుకున్నామని, విద్యార్థులు ఈ ఆన్‌లైన్ తరగతులను తప్పకుండా అధ్యయనం చేసేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాని ముఖ్యమంత్రి సూచించారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి కెటి జలీల్ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతి ప్రారంభించి చరిత్ర పాఠాలు చెప్పారు.

Education News Academic Year begins in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News