Home తాజా వార్తలు షాకిచ్చిన ఈషా

షాకిచ్చిన ఈషా

Eesha-Rebba-Photosతెలుగమ్మాయిలు గ్లామర్‌కు దూరమన్న అపవాదు ఎప్పుడో తొలగిపోయింది. ఇప్పుడొస్తున్న ముద్దుగుమ్మలు కొంచెం కొంచెంగా ఆ అనుమానాలను పూర్తిగా పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమాల్లో హద్దులు మీరని గ్లామర్‌తో ఆకట్టుకున్న తెలంగాణ బ్యూటీ ఈషా రెబ్బ ఇప్పుడు సోషల్ మీడియాలో షాకిచ్చింది. తన అందచందాలను ప్రదర్శిస్తూ తనలోని గ్లామర్ యాంగిల్‌ను బయటపెట్టే ఫొటోలతో ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈషా హాట్ ఫొటోలు కుర్రకారును మైమరపిస్తున్నాయి.

మంచి టాలెంట్‌తో ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న ఈషా రెబ్బా అకస్మాత్తుగా ఎందుకింత గ్లామర్ ఒలకబోసిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందేనట. బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తానంటోంది ఈ బ్యూటీ. అంటే బిగ్ ఆఫర్ ఏదో కొట్టేసినట్లుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో ‘అరవింద సమేత…’ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో కొత్త సినిమాలేమీ లేవు కానీ.. అమ్మడి ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఏదో పెద్ద ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్లు అనిపిస్తోంది.

Eesha Rebba Glamorous Photos Goes Viral