Home వరంగల్ ఆర్‌టిసి బస్సులో మంత్రి ఈటల

ఆర్‌టిసి బస్సులో మంత్రి ఈటల

Eetela Rajender Traveld in RTC Bus In Warangal

మన తెలంగాణ/కమలాపూర్(నేరేళ్ళ) : ఆర్ధిక మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం టియస్ ఆర్టీసి బస్సులో ప్రయాణించడం జరిగింది.కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల శంఖు స్ధాపనల కార్యక్రమంకు విచ్చేసిన మంత్రి ఈటల నేరేళ్ళ గ్రామ ప్రజల ప్రయాణ సౌకర్యం కోరకు హన్మకొండ డిపో నుండి బస్సును ప్రారంభించడం జరిగింది.బస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి ఈటల రాజేందర్ బస్సు ముందు సీట్లో కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ నేరేళ్ళ నుండి అంబాల మీదుగా సుమారు 6 కిలో మీటర్ల మేరకు 15 నిముషాలు ప్రయాణించడం జరిగింది.బస్సులో మంత్రి ఈటలతో పాటు ఎంపీపి లాండిగే లక్ష్మణ్ రావు,జడ్పిటీసి మారపెల్లి నవీన్ కుమార్,రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఇమ్మడిశెట్టి శ్రీనివాస్,ఆర్డీవో వెంకా రెడ్డి,నాయకులు పింగిళి ప్రదీప్ రెడ్డి,శోభన్ బాబు,వేణులు ప్రయాణించారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ఆర్టీసి బస్సులో ప్రయాణమే సురక్షితం అని,ప్రజలు సుదూర ప్రయాణాలకు సురక్షిత ప్రయాణం అయిన ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణిం చేయాలన్నారు.