Friday, March 29, 2024

ఇమ్యూనిటీపై శీతాకాల ప్రభావం

- Advertisement -
- Advertisement -

శీతాకాలంలో చల్లని గాలులతో కూడిన వాతావరణం వల్ల చాలా మందికి జలుబు, జ్వరాలు సంక్రమిస్తుంటాయి. జలుబు, దగ్గు, భరించలేని చల్లదనం వీటన్నిటినీ తట్టుకోడానికి శరీరం పోరాటం చేస్తుంటుంది. అయినాసరే ప్రతిసారి శీతాకాలంలో కొన్ని రుగ్మతలను ఎదుర్కోక తప్పదు. అతిశీతల ఉష్ణోగ్రతలు ఇమ్యునిటీ ( వ్యాధి నిరోధక శక్తి) ని తగ్గిస్తుంటాయి. వైరస్‌ల బారిన పడేటట్టు చేస్తాయి.

సైంటిఫిక్‌గా చెప్పాలంటే శరీరం లోని అంతర్గత వ్యాధి నిరోధక శక్తి స్పందన బాగా తగ్గుతుంది. ఉష్ణోగ్రతల్లో 4.4 డిగ్రీల సెల్సియస్ తగ్గితే ముక్కు రంధ్రాల్లోని వైరస్‌తో పోరు సాగించే కణాల్లో 50 శాతం తగ్గిపోతుంది. అలాగే కణాలపై వైరస్‌ను ఆకర్షించే గ్రాహకాలు (రిసెప్టర్స్)70 శాతం తగ్గిపోతాయి. ఇవన్నీ బాహ్యకణ తిత్తులు (extra cellular vesicles ). శరీరం లోని వైరస్‌ను నిర్మూలించడానికి వైరస్‌ను ఆకర్షించే గ్రాహకాలు ముక్కు రంధ్రాల్లోని ఉపరితల కణాల కన్నా బాహ్య కణ తిత్తుల్లో 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి.

సాధారణంగా ముక్కు రంధ్రాల బాహ్యకణ తిత్తుల్లోని సూక్ష్మ ఆర్‌ఎన్‌ఎ కన్నా ఇతర బాహ్యకణ తిత్తుల్లో సూక్ష్మ ఆర్‌ఎన్‌ఎ 13 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక మాస్కులు తప్పనిసరి. మాస్కుల వల్ల వైరస్ వ్యాపించకుండా నిరోధించగలుగుతుంది.శ్వాసకోశ మార్గాలు తేమగా ఉండేలా మాస్కులు సహాయపడతాయి. వెచ్చదనం కూడా కలుగుతుంది. బయట విపరీతమైన చలి ఉంటే మాస్క్‌ను కప్పుకుని ఉండేలా మఫ్లర్ వంటివి వాడడం మంచిది.

ఇమ్యూనిటీని పెంచుకోడానికి కొన్ని చిట్కాలు అనుసరించవచ్చు. చలి తగలకుండా దళసరి దుస్తులు ధరించాలి. శరీరం వెచ్చగా ఉండేలా చేయాలి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజు చేయడం అవసరం. విటమిన్లు, మినరల్స్, పీచు పదార్ధాలు ఎక్కువగా ఉండేలా తులనాత్మక ఆహారం తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి వల్ల శరీరం లోని శక్తి స్థాయిలు, ఇమ్యునిటీ స్థాయిలు తగ్గుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. ఇలాంటి జాగ్రత్తలు క్రమంగా తీసుకుంటే శీతాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News