Home పెద్దపల్లి ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించండి

ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించండి

Effectively manage the public distribution system

మనతెలంగాణ / పెద్దపల్లి: రేషన్ డీలర్ల సమ్మె నేపద్యంలో ప్రజాపంపిణి వ్యవస్థను అధికారులు సక్రమంగా నిర్వహించి జులై నెల సరుకులను ప్రజలకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని  పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి అదికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో రెవిస్యూ,సివిల్ సప్లై అదికారులతో నిర్వహించిన సమిక్షా సమాశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అదికారులు సిద్దంగా ఉండాలని అన్నారు. జిల్లాలో  413 రేషన్ షాపులు ఉండగా జులై నెలకు గాను ఇప్పటి వరకు 20 దుకాణాల యజమానులు డీడీలు చెల్లించారని,డీడీలు చెల్లిచంని వారికి నోటీసులు అందజేశామని,నిబందనల ప్రకారం వారందరి డీలర్‌షిప్ లైసెన్స్‌లు రద్దుచేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో  గుర్తించిన మహిళా సంఘాలకు,అర్బన్ ఎరియాలైన పెద్దపల్లి రామగుండం ప్రాంతాలలో మెప్మా గ్రూపులకు తాత్కాలిక ప్రాతిపాదికన లైసెన్స్‌లు మంజూరు చేయాలని ఆదేశించారు.  ఈ నెల 3 లోపు కొత్తగా గుర్తించిన డీలర్ల నుండి మీ సేవల ద్వారా చెల్లింపులు చేయించి సరుకులను రేషన్ షాపుల వద్దకు చేర్చాలని ఆదేశించారు. రేషన్ షాపులను లబ్దిదారులు ఉన్న చోటనే ఎర్పాటు చేయడానికి పోర్టిబులిటి లేకుంటె అనువైన స్థలాలను గుర్తించి,వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సరుకులను బద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుసకోసవాలని అన్నారు. జులై 1నుండి జులై 4 వరకు ఎం.ఎల్.ఎస్ పాయింట్లనుండి రేషన్‌షాపుల వద్దకు సరుకుల రవాణా పూర్తి చేసి,రేషన్  స్టాక్ పాయింట్ల వద్ద సంబందిత విఎవోలు రిజస్టర్లు మేయింటెనెన్స్ చేయాలని పేర్కొన్నారు. డీలర్ల సమ్మె నేపద్యంలో రేషన్ షాపుల వద్ద క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అదికారులు సమర్థ వంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపద్యంలో ప్రజలు ప్రజాపంపిణికి సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డిఆర్‌డివో ప్రేమ్‌కుమార్,జిల్లా పౌరసరఫరాల అదికారి ప్రేమ్‌కుమార్,జిల్లా పౌరపరఫరాల సంస్థ మేనేజర్ అభిషేక్ సింగ్,ఎపిఎంవోలు సంబందిత అధికారులు పాల్గొన్నారు.