Home Default దళితుల అభివృద్ధికి కృషి : బండ శ్రీనివాస్

దళితుల అభివృద్ధికి కృషి : బండ శ్రీనివాస్

Efforts for development of Dalits : Banda Srinivasహైదరాబాద్ : దళితుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించిన సిఎం కెసిఆర్ కు, అందుకు సహకరించిన మంత్రులు కెటిఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం కెసిఆర్ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇందుకు దళిత బంధు నిదర్శనమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పలువురు దళిత నాయకులు, అధికారులు పాల్గొన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్ ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ సిఎం కెసిఆర్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.