Home తాజా వార్తలు సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి : కెటిఆర్

సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి : కెటిఆర్

KTRహైదరాబాద్ : ఇండియా జాయ్-2019 ఎక్స్‌పోను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ ఇదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఇండియా జాయ్ నిర్వహిస్తున్న తెలంగాణ వీఎఫ్‌ఎక్స్ , యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ కు కెటిఆర్ అభినందనలు తెలిపారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదికగా మారిందని ఆయన వెల్లడించారు. అనేక భారీ సినిమాలకు హైదరాబాద్‌లోనే వీఎఫ్‌ఎక్స్ వర్కు జరుగుతుందన్నారు. వచే ఏడాది కల్లా ప్రపంచ యానిమేషన్ రంగం 270 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. యానిమేషన్‌తో పాటు గేమింగ్ పరిశ్రమ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గేమింగ్ ఇండస్ట్రీ మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సినిమా స్టూడియోలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ యానిమేషన్ రంగాల్లో కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. వెయ్యి కోట్ల ఖర్చుతో హైదరాబాద్‌లో ఇమేజ్ టవర్‌ను నిర్మించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. 2021 చివరి నాటికి ఇమేజ్ టవర్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. టాస్క్ ద్వారా ఈ రంగంల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇస్తామని ఆయన చెప్పారు. 15 విభాగాల్లో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత కంపెనీలే ఈ రంగంలో ఇంకా నేర్చుకుంటున్నాయని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటి సెక్రటరీ జయేష్ రంజన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటి నమత్రా శిరోద్కర్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సిఇఒ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Efforts To Develop Film Industry : Minister KTR