Saturday, April 20, 2024

అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభానికి ప్రయత్నాలు

- Advertisement -
- Advertisement -

Efforts to launch international Flights

 

ట్విటర్‌లో విమానయాన మంత్రి హర్దీప్ వెల్లడి
తొలుత బిజినెస్‌మెన్‌లు.. నిపుణులకు ప్రాధాన్యం!

న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు. అందుకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కొంచెం సాధారణ స్థితికి చేరుకోగానే అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తామని బుధవారంనాడు ట్విటర్‌లో పేర్కొన్నారు. పౌరులకు ఎటువంటి ప్రమాదం కలిగించని రీతిలో వ్యాపార నిమిత్తం దేశానికి వచ్చే విదేశీయులకు పరిమిత వీసాలపై అనుమతించేదుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పరిమిత సంఖ్యలో విదేశీ వ్యాపారుల ప్రయాణాలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడడం విశేషం.

ఈ మేరకు కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరీలోనే దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వైద్యరంగ సంబంధిత నిపుణులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. వారిలో హెల్త్‌కేర్ నిపుణులు, పరిశోధకులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు సడలింపులు పొందేందుకు మొట్టమొదట ఆయా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ లేదా రిజిస్టర్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వాన పత్రం పొందవలసి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News