Home తాజా వార్తలు విద్యుత్ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి 8 పశువుల బలి

విద్యుత్ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి 8 పశువుల బలి

Cows Deadరూ.5 లక్షల ఆస్తి నష్టం

కామేపల్లి: విద్యుత్ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి 8 పశువులు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామేపల్లి మండలపరిధిలోని గోవింద్రాల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు… గోవింద్రాలలో బుధవారం ఆకస్మికంగా వచ్చిన గాలి దూమారానికి విద్యుత్ వైర్లు తెగిపడి పంటచేలలో అలాగే ఉండిపోయాయి. విద్యుత్‌శాఖాధికారులు, గ్రామస్తులు, రైతులెవరు అటువైపు వెళ్ళకపోవడంతో శుక్రవారం ఉదయం మేతకు వెళ్ళిన 8 ఆవులు తెగిపడిన విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుత్ షాక్ తో మృతిచెందాయి. ఈ 8 ఆవులు గ్రామానికి చెందిన లాకవత్ రామా, దేవ్‌సింగ్, కిషన్, రవి, నెహ్రు, హేమ్లా, శంకర్, రాంచందర్‌కు చెందినవి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పశువులు మృతిచెందాయని రైతులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి స్థానిక ఎస్సై తిరుపతిరెడ్డి తన సిబ్బందితో చేరుకొని విద్యుత్ శాఖాధికారులతో చర్చలు జరిపి బాధిత రైతులకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా ట్రాన్స్‌కో అధికారులు రూ.40 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం స్థానిక విఆర్‌ఓ బాలరాజు, పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎఇ నారాయణ, సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Eight Cows Dead with Electric Shock in Bhadradr Kothagudem Dist